ఖమ్మంలో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం…
దిశ, ఖమ్మం టౌన్: వివిధ కుల, ప్రజా సంఘాలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి వెంకన్న శుక్రవారం 50వ డివిజన్ లో వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. తాను కార్పొరేటర్ గా ఎన్నికైతే ఐదు సంవత్సరాల పదవీ కాలంలో తాను చేయనున్న వివిధ అభివృద్ధి పనులను బాండ్ పేపర్ మీద రాసి, ఓటర్లకు పంపిణీ చేస్తూ ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. పారదర్శకంగా పని చేస్తానని హామీ ఇస్తూ బాండ్ పేపర్ లో సంతకాలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న […]
దిశ, ఖమ్మం టౌన్: వివిధ కుల, ప్రజా సంఘాలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి వెంకన్న శుక్రవారం 50వ డివిజన్ లో వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. తాను కార్పొరేటర్ గా ఎన్నికైతే ఐదు సంవత్సరాల పదవీ కాలంలో తాను చేయనున్న వివిధ అభివృద్ధి పనులను బాండ్ పేపర్ మీద రాసి, ఓటర్లకు పంపిణీ చేస్తూ ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. పారదర్శకంగా పని చేస్తానని హామీ ఇస్తూ బాండ్ పేపర్ లో సంతకాలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న తాను గత 25 సంవత్సరాలు పైగా ప్రజాసేవలో ఉంటూ ప్రజల సమస్యలకి పరిష్కారం చూపుతూ వచ్చానని పేర్కొన్నారు.
వివిధ కుల ప్రజాసంఘాల నాయకులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు కూడా తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉన్నారని తెలిపారు. ఇంటింటా ప్రచారంలో ప్రజలకు ఈ వివరాలను వెల్లడిస్తూ, బాండ్ పేపర్ అందజేస్తూ , సాగిస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తుందని కోయినీ వెంకన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు బానోతు భద్రునాయక్, సోమరాజు, గరిడేపల్లి నాగేశ్వరరావు, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.