మంత్రి నోట మహానుభావుల మాట.. ఎవరతను ?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మనం పీల్చుతున్న స్వేచ్చా వాయివులకు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జరిగిన 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు అందించేందుకు కేసీఆర్ నాయకత్వంలో […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: మనం పీల్చుతున్న స్వేచ్చా వాయివులకు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని రాష్ర్ట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జరిగిన 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను అవిష్కరించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు అందించేందుకు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. పేదలకు అండగా ఉండేందుకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ద్వారా పంటలకు నీరందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఎమ్మెల్యే గణేష్ గుప్తా, డీసీసీబీ చైర్మెన్ బాస్కర్ రెడ్డి, సీపీ కార్తీకేయ, జేసిలు లత, చంద్రశేఖర్ అదికారులు పాల్గోన్నారు.