సామాన్యుడిపై పెట్రోల్ భారం

దిశ,వెబ్‌డెస్క్ : పెట్రోల్ మంట సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తుంది. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. అసలే కరోనా మూలంగా చేతినిండా పనిలేక కుటుంబాన్ని పోషించడమే భారంగా మారిపోయిన సమయంలో పెరిగిన ధరలు ఆందోళనకు గురి చేస్తుంది. తెలుగు రాష్ట్రల్లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. శుక్రవారం మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో […]

Update: 2021-06-17 20:58 GMT

దిశ,వెబ్‌డెస్క్ : పెట్రోల్ మంట సామాన్యులను ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేస్తుంది. ఓ వైపు నిత్యావసర సరకుల ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలతో సామాన్యుని పరిస్థితి అస్థవ్యస్తంగా మారింది. అసలే కరోనా మూలంగా చేతినిండా పనిలేక కుటుంబాన్ని పోషించడమే భారంగా మారిపోయిన సమయంలో పెరిగిన ధరలు ఆందోళనకు గురి చేస్తుంది. తెలుగు రాష్ట్రల్లో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. శుక్రవారం మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.74, ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 95.60గా ఉంది. అలాగే విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.93గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 97.17గా ఉంది.

Tags:    

Similar News