బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో పెరిగిన ల్యాండ్ వాల్యూ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం భూముల మార్కెట్విలువలను, రిజిస్ట్రేషన్ఫీజులను పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలను ఈ నెల 22 నుంచి అమల్లోకి తీసుకురానుంది. మార్కెట్విలువలను ఏ స్థాయిలో పెంచనున్నారన్న విషయాన్ని ఉత్తర్వులో పేర్కొనలేదు. త్వరలోనే ధరణి పోర్టల్, ఐజీఆర్ఎస్(వ్యవసాయేతర ఆస్తులు) వెబ్‌సైట్లల్లో అప్డేట్చేయనున్నారు. అయితే ఇంటి స్థలాలకు 30 నుంచి 60 శాతం, వ్యవసాయ భూములకు 30 నుంచి 100 శాతం వరకు మార్కెట్విలువలను పెంచనుందని విశ్వసనీయంగా తెలిసింది. రిజిస్ట్రేషన్ఫీజును మాత్రం […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం భూముల మార్కెట్విలువలను, రిజిస్ట్రేషన్ఫీజులను పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలను ఈ నెల 22 నుంచి అమల్లోకి తీసుకురానుంది. మార్కెట్విలువలను ఏ స్థాయిలో పెంచనున్నారన్న విషయాన్ని ఉత్తర్వులో పేర్కొనలేదు. త్వరలోనే ధరణి పోర్టల్, ఐజీఆర్ఎస్(వ్యవసాయేతర ఆస్తులు) వెబ్‌సైట్లల్లో అప్డేట్చేయనున్నారు. అయితే ఇంటి స్థలాలకు 30 నుంచి 60 శాతం, వ్యవసాయ భూములకు 30 నుంచి 100 శాతం వరకు మార్కెట్విలువలను పెంచనుందని విశ్వసనీయంగా తెలిసింది.
రిజిస్ట్రేషన్ఫీజును మాత్రం 6 నుంచి 7.50 శాతానికి పెంచుతున్నట్లు సమాచారం. ఒకేసారి 1.50 శాతాన్ని పెంచడంతో ఆదాయం 25 శాతం పెరుగుతుందని అంచనా. ఫీజుల క్లాసిఫికేషన్‌లోనూ మార్పులు తీసుకురానుంది. గతంలో స్టాంపు డ్యూటీతో పాటు ట్రాన్స్ఫర్ఆఫ్ డ్యూటీ కింద 1.5 శాతాన్ని వసూలు చేసేది. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ఫీజు మాత్రమే ఉంటుందని తెలిసింది. ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ఆఫ్డ్యూటీ కింద వచ్చిన నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేసేవారు. అభివృద్ది కార్యక్రమాల కోసం తోడ్పాటునందించేవారు.
ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరేవి. అయితే, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ఫీజుల సవరణలో స్థానిక సంస్థలకు కేటాయించే నిధులను ఏ ప్రాతిపదికన మంజూరు చేస్తుందో వేచి చూడాలి. ఇప్పటి దాకా భూ క్రయ విక్రయాలు అత్యధికంగా జరిగే స్థానిక సంస్థలకు స్టాంప్స్ అండ్రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ప్రతి ఏటా రూ.కోట్లల్లో ఆదాయం వచ్చేది. వాటితో కొత్తగా విస్తరించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెసులుబాటు కలిగేది. ఇప్పటి వరకు గిఫ్ట్డీడ్వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం సమకూరేది కాదు. ఇప్పుడు ఆ మాడ్యూల్‌ను కూడా మార్చనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో కుటుంబ సభ్యులకు సంబంధించిన మార్పులు చేయనున్నట్లు సమాచారం. పార్టిషన్ డీడ్‌కి సంబంధించిన అంశాల్లోనూ మ్యుటేషన్ల చార్జీలు తప్ప మరో రకమైన ఆదాయం రావడం లేదు. అంటే రిజిస్ట్రేషన్ చార్జీలు ఖజానాకు చేరవు. ప్రతి అంశంలోనూ, ఆస్తి లావాదేవీ మార్పుల్లోనూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరేటట్లుగా కొత్త విధానాలను అమలు చేయనున్నట్లు తెలిసింది.