పండుగ వేళ.. ఆకాశాన్నంటిన పూల ధర
దిశ, వెబ్‌డెస్క్ : బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ. తీరొక్క పూలు తీసుకచ్చి బతుకమ్మను అందగా పేర్చుతారు ఆడబిడ్డలు. ఇక ఆరోజు ఎవరి బతుకమ్మ ఎంత పెద్దగా ఉంది, ఎవరు ఎన్నిరకాల పూలు పెట్టారంటూ గుసగుసలాడుకుంటారు.. పక్కింటి వాళ్లకన్న మన బతుకమ్మే పెద్దగా ఉండాలని ఎన్నో రకాల పూలు తీసుకచ్చి బతుకమ్మ పేరుస్తారు. అయితే బతుకమ్మ పండుగ నేపథ్యంలో పూలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లలో బంతి పూల ధర రూ.120 నుంచి రూ.180లకు పెరిగింది. నిన్న […]
దిశ, వెబ్‌డెస్క్ : బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ. తీరొక్క పూలు తీసుకచ్చి బతుకమ్మను అందగా పేర్చుతారు ఆడబిడ్డలు. ఇక ఆరోజు ఎవరి బతుకమ్మ ఎంత పెద్దగా ఉంది, ఎవరు ఎన్నిరకాల పూలు పెట్టారంటూ గుసగుసలాడుకుంటారు.. పక్కింటి వాళ్లకన్న మన బతుకమ్మే పెద్దగా ఉండాలని ఎన్నో రకాల పూలు తీసుకచ్చి బతుకమ్మ పేరుస్తారు. అయితే బతుకమ్మ పండుగ నేపథ్యంలో పూలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లలో బంతి పూల ధర రూ.120 నుంచి రూ.180లకు పెరిగింది. నిన్న మొన్నటి వరకు రూ.10 నుంచి 20 వరకు ఉన్న పూల ధర అమాతం పెరిగే సరికి కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా రెండు రోజుల క్రితం ఉన్న వరకు చామంతి పూలు కిలో ధర రూ.50 నుంచి రూ.80 ఉండగా, ఇప్పుడు రూ.200 నుంచి రూ.250కి పెరిగింది. అయితే ఇవి హోల్‌సేల్ ధరలు మాత్రమేనని, రిటైల్‌కు వచ్చే సరికి కిలో చామంతి ధర రెట్టింపు అవుతుందని సమాచారం. ఈ పండుగ సీజన్‌లో పూల ధరలు పెరగడం సహజం. ఇంకా మరో రెండు, మూడు రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.