కొండెక్కిన కోడిగుడ్ల ధరలు..!

దిశ, వెబ్‎డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మార్కెట్‎లో ఒక్కో గుడ్డు ధర రూ.6 నుంచి రూ.7 కు పలుకుతోంది. హోల్‎సేల్ రేటు 100 గుడ్ల ఫామ్‎రేటు ధర రూ.540కి చేరింది. గుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడం.. వినియోగం పెరిగిన కారణంగా ధరలు పెరిగినట్టుగా పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు కోడిగుడ్డు కీలకపాత్ర పోషిస్తోంది. గుడ్డులోని పోషక విలువలు మనిషిలో ఇమ్యూనిటీ పవర్‎ను పెంచడంతో మధ్య తరగతి కుటుంబాలు […]

Update: 2020-10-09 08:55 GMT

దిశ, వెబ్‎డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మార్కెట్‎లో ఒక్కో గుడ్డు ధర రూ.6 నుంచి రూ.7 కు పలుకుతోంది. హోల్‎సేల్ రేటు 100 గుడ్ల ఫామ్‎రేటు ధర రూ.540కి చేరింది. గుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడం.. వినియోగం పెరిగిన కారణంగా ధరలు పెరిగినట్టుగా పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.

కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు కోడిగుడ్డు కీలకపాత్ర పోషిస్తోంది. గుడ్డులోని పోషక విలువలు మనిషిలో ఇమ్యూనిటీ పవర్‎ను పెంచడంతో మధ్య తరగతి కుటుంబాలు సైతం తమ రోజూ మెనూలో గుడ్డును భాగం చేశారు. కోడిగుడ్లతో పాటు చికెన్ కూడ మనిషిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించనుందని వైద్యులు చెబుతున్నారు.

కరోనా వచ్చిన తొలి రోజుల్లో చికెన్, గుడ్ల రేట్లు పూర్తిగా తగ్గిపోయాయి. పలు చోట్ల పౌల్ట్రీ నిర్వాహకులు కొంతమంది వ్యాపారం నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వమే చికెన్ తింటే మంచిదని.. చికెన్‎లో వేడి ఎక్కువగా ఉండడంతో కరోనా తగ్గుతోందని చెప్పడంతో చికెన్, గుడ్లను కొనేందుకు ప్రజలు బారులు తీరారు. దీంతో గుడ్లకు డిమాండ్ పెరగడంతో ధరలు విపరీతంగా పెరిగినట్టుగా వ్యాపారులు తెలిపారు.

Tags:    

Similar News