మౌలికానికి మూలధన పెరగడం వల్ల ఉక్కుకు డిమాండ్!

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెరిగిన మూలధన వ్యయం కారణంగా దేశీయంగా ఉక్కు డిమాండ్‌ను పెంచుతుందని పరిశ్రమ సంస్థ ఐఎస్ఏ బుధవారం తెలిపింది. దేశీయ మౌలిక సదుపాయలను పెంచడానికి, వచ్చే ఆర్థిక సంవత్సర మూలధన వ్యయాన్ని రూ. 5.54 లక్షల కోట్లకు పెంచాలని బడ్జెట్ ప్రతిపాదించింది. సంస్థాగత నిర్మాణాలను రూపొందించడంతో పాటు జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లై లక్ష్యాలను సాధించేందుకు ఆస్తులను నగదు ఆర్జించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ‘రోడులు, […]

Update: 2021-02-03 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెరిగిన మూలధన వ్యయం కారణంగా దేశీయంగా ఉక్కు డిమాండ్‌ను పెంచుతుందని పరిశ్రమ సంస్థ ఐఎస్ఏ బుధవారం తెలిపింది. దేశీయ మౌలిక సదుపాయలను పెంచడానికి, వచ్చే ఆర్థిక సంవత్సర మూలధన వ్యయాన్ని రూ. 5.54 లక్షల కోట్లకు పెంచాలని బడ్జెట్ ప్రతిపాదించింది. సంస్థాగత నిర్మాణాలను రూపొందించడంతో పాటు జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లై లక్ష్యాలను సాధించేందుకు ఆస్తులను నగదు ఆర్జించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. ‘రోడులు, రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలతో పాటు మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి ఆర్థిక సహాయం కోసం ఓ సంస్థను ఏర్పాటు చేసేందుకు బిల్లును ప్రవేశపెట్టడం సంతోషం. మౌలిక సదుపాయాలు, సంబంధిత విభాగాల్లో మెరుగైన పెట్టుబడులతో ఉక్కుకు డిమాండ్ పెరుగుదలను సృష్టిస్తాయి’ అని ఇండియ స్టీల్ అసోసియేషన్(ఐసీఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags:    

Similar News