ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడుపు పెంపు
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో ప్రతి ఏడు మార్చి 31 ఆర్థిక సంవత్సరం లోపు సమర్పించాల్సిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను కేంద్రం పొడిగించింది. కరోనా ప్రభావంతో అత్యవసర సేవలు మినహా బ్యాంకులు, కంపెనీలు, అన్నిరంగాలు బంద్ పాటిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఐటీ రిటర్న్స్ సమర్సించాల్సిన తేదీని జూన్ 30వరకు పొడిగించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఎమర్జెన్సీ […]
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో ప్రతి ఏడు మార్చి 31 ఆర్థిక సంవత్సరం లోపు సమర్పించాల్సిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను కేంద్రం పొడిగించింది. కరోనా ప్రభావంతో అత్యవసర సేవలు మినహా బ్యాంకులు, కంపెనీలు, అన్నిరంగాలు బంద్ పాటిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఐటీ రిటర్న్స్ సమర్సించాల్సిన తేదీని జూన్ 30వరకు పొడిగించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఎమర్జెన్సీ విధించబోమన్నారు. ఆలస్య రుసుమును 12 నుంచి 9శాతానికి కోత విధించినట్టు పేర్కొన్నారు. దాంతో పాటే ఆధార్ పాన్ లింకింగ్ గడువును కూడా జూన్ 30వరకు పొడిగించామన్నారు. అన్నిరకాల బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. కరోనాను నివారించేందుకే దేశంలో పలుచోట్ల లాక్‌డౌన్ విధిస్తున్నట్టు మరోసారి మంత్రి స్పష్టం చేశారు.
Tags: income tax return date extension, central minister nirmala, june 30, adhar and pan link, coronavirus