విజయ్‌ నివాసంలో దాడులపై కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: తమిళ హీరో దళపతి విజయ్ నివాసంలో ఐటీ రైడ్స్ ఘటన తమిళనాట సంచలనం కలిగించింది. ‘మాస్టర్’ షూటింగ్‌లో ఉన్న విజయ్‌ను అక్కడే విచారించిన అధికారులు… తర్వాతి రోజు తన నివాసంలో దాడులు నిర్వహించారు. విజయ్ ‘బిగిల్’, ‘మాస్టర్’ చిత్రాల పారితోషికాలపై ఆరా తీసిన అధికారులు… విజయ్ ఇంట్లో ఒక్క రూపాయి కూడా అక్రమ సంపాదన లేదని తెలిపారు. అయితే ఇదంతా బీజేపీ కుట్రే అంటూ విజయ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆ తర్వాత విజయ్ ఫ్యాన్స్‌ను […]

Update: 2020-03-13 04:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళ హీరో దళపతి విజయ్ నివాసంలో ఐటీ రైడ్స్ ఘటన తమిళనాట సంచలనం కలిగించింది. ‘మాస్టర్’ షూటింగ్‌లో ఉన్న విజయ్‌ను అక్కడే విచారించిన అధికారులు… తర్వాతి రోజు తన నివాసంలో దాడులు నిర్వహించారు. విజయ్ ‘బిగిల్’, ‘మాస్టర్’ చిత్రాల పారితోషికాలపై ఆరా తీసిన అధికారులు… విజయ్ ఇంట్లో ఒక్క రూపాయి కూడా అక్రమ సంపాదన లేదని తెలిపారు. అయితే ఇదంతా బీజేపీ కుట్రే అంటూ విజయ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆ తర్వాత విజయ్ ఫ్యాన్స్‌ను కలవడం… అభిమానులు కూల్ అవడం…. షూటింగ్‌లో బిజీ అయిపోవడం జరిగింది.

అయితే తాజాగా ‘మాస్టర్’ నిర్మాత లలిత్ కుమార్ నివాసం, కార్యలయాల్లోనూ సోదాలు నిర్వహించారు అధికారులు. కానీ అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో మీడియా ప్రకటన రిలీజ్ చేశారు. విజయ్ దగ్గర ఎలాంటి అక్రమ సంపాదని లేదని స్పష్టం చేశారు. తను సినిమాలకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి పూర్తిగా సమాచారం ఉందని ట్యాక్స్ సక్రమంగా చెల్లిస్తున్నారని వెల్లడించారు. ఎలాంటి బకాయిలు లేవని తెలిపారు.

Tags: Vijay, Bigil, Master, IT Raids, Lalith Kumar

Tags:    

Similar News