కాంచీవరం చీరలో ప్రభాస్ హీరోయిన్.. నీ అందం కింద అప్సరస అయినా దిగదుడుపే అంటూ కామెంట్స్
అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘వర్షం’(Varsham) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి వావ్ అనిపించుకుంది. అయితే సడెన్‌గా కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి.. యంగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో 8 సినిమాలకు పైనే ఉన్నాయి. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా త్రిష తన ఇన్‌స్టా(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో కాంచీవరం చీర(Kanjivaram Saree) కట్టుకొని ఫొటోలకి స్టిల్స్ ఇచ్చింది. అంతే కాకుండా వాటికి ‘ఫ్యాషన్ అనేది వస్తుంది పోతుంది కానీ, కాంచీవరం అనేది మాత్రం శాశ్వతంగా ఉంటుంది’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. ఈ వయసులో కూడా ఈ అందం ఎలా సాధ్యం అని, నీ గ్లామర్ కింద అప్సరస అయినా దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.