కొండగట్టులో రామకోటి స్థూపానికి శ్రీకారం
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో కొండగట్టు అంజన్న ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శ్రీరామ కోటి స్థూపానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మంగళవారం శంకుస్థాపన చేశారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఉత్తర ద్వారం ముందు రూ.90 లక్షలతో నిర్మించనున్న రామకోటి స్తూపానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి మంత్రి అల్లోల దంపతులు, ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో కొండగట్టు అంజన్న ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శ్రీరామ కోటి స్థూపానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మంగళవారం శంకుస్థాపన చేశారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఉత్తర ద్వారం ముందు రూ.90 లక్షలతో నిర్మించనున్న రామకోటి స్తూపానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి మంత్రి అల్లోల దంపతులు, ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.