తమిళనాడులో ఓటు వేసిన గవర్నర్ తమిళిసై
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్ట గవర్నర్ తమిళిసై సొంత రాష్ర్టమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఓటు వేయడం నిబద్దతకు నిదర్శనమన్నారు. మన ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన సాధనం ఓటు అని తెలిపారు. అర్హత కలిగిన ఓటర్లందరూ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్ట గవర్నర్ తమిళిసై సొంత రాష్ర్టమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఓటు వేయడం నిబద్దతకు నిదర్శనమన్నారు. మన ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైన సాధనం ఓటు అని తెలిపారు. అర్హత కలిగిన ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని గవర్నర్ కోరారు.
Today Cast my vote at the Virugambakkam Polling booth in Chennai. Voting is a commitment to ourselves & our country. It's the most powerful tool in our democracy.I appeal all the eligible voters to excercise their democratic right & also to follow Covid Appropriate Behaviours. pic.twitter.com/WsqULUHxZF
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) April 6, 2021