ఏకాంతంగా స్వామి వార్ల నిత్యకైంకర్యాలు

దిశ, యాదగిరిగుట్ట: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం లో నిత్య పూజలన్ని ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం స్వామి అమ్మవార్లకు అభిషేకం మొదలు రాత్రి స్వామి అమ్మవార్ల శయనింపు సేవ వరకు నిత్యపూజలు అన్నీ ఏకాంతంగానే జరుగుతున్నాయి. ఇక పూజలలో ఎవరు పాల్గొనక పోవడం తో దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం గండిపడింది. లడ్డూ పులిహోర ప్రసాదాలను తయారుచేయడం పూర్తిగా మానేశారు. […]

Update: 2021-05-15 04:43 GMT

దిశ, యాదగిరిగుట్ట: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం లో నిత్య పూజలన్ని ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. ఉదయం స్వామి అమ్మవార్లకు అభిషేకం మొదలు రాత్రి స్వామి అమ్మవార్ల శయనింపు సేవ వరకు నిత్యపూజలు అన్నీ ఏకాంతంగానే జరుగుతున్నాయి. ఇక పూజలలో ఎవరు పాల్గొనక పోవడం తో దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం గండిపడింది. లడ్డూ పులిహోర ప్రసాదాలను తయారుచేయడం పూర్తిగా మానేశారు.

అలాగే ఈనెల సిబ్బందికి వచ్చే వేతనాలు ఇచ్చేందుకు దేవస్థానంలో సరైన ఆదాయం లేక పోయిందని కొందరు దేవస్థానం అధికారులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ నెల వేతనాలు అను మానమే అంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు నల్లం తిఘల్ లక్ష్మీనరసింహా చార్యులు, కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్యులు, మోహన్ ఆచార్యులు ,ఆలయ అధికారులు రామ్మోహన్ రావు, గజ్వేల్ రమేష్, నరేష్ ,రామారావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News