సీఐ వేధింపులు.. ఆర్టీసీ కార్మికుల ధర్నా
దిశ, వెబ్‌డెస్క్: కోదాడ ఆర్టీసీ డిపోలో బుధవారం తెల్లవారుజామున డ్రైవర్లు, కండక్టర్లు విధులు మానేసి ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ సీఐ లావణ్య కార్మికులను వేధిస్తోందని, వ్యక్తిగత దూషణలు చేస్తోందని, 8 గంటలు చేయాల్సిన డ్యూటీని 12 గంటలు చేయిస్తున్నరంటూ కార్మికులు ఆందోళన నిర్వహించారు. దీంతో వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు విధులకు వెళ్లేది లేదని డిపో ఎదుట నిరసన తెలిపారు. విషయం తెలిసిన సీఐటీయూ నేతలు ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతు […]
దిశ, వెబ్‌డెస్క్: కోదాడ ఆర్టీసీ డిపోలో బుధవారం తెల్లవారుజామున డ్రైవర్లు, కండక్టర్లు విధులు మానేసి ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ సీఐ లావణ్య కార్మికులను వేధిస్తోందని, వ్యక్తిగత దూషణలు చేస్తోందని, 8 గంటలు చేయాల్సిన డ్యూటీని 12 గంటలు చేయిస్తున్నరంటూ కార్మికులు ఆందోళన నిర్వహించారు. దీంతో వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు విధులకు వెళ్లేది లేదని డిపో ఎదుట నిరసన తెలిపారు. విషయం తెలిసిన సీఐటీయూ నేతలు ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు మద్దతు పలికారు.