కడపలో ఐఎంఆర్ ఏజీ స్టీల్ ప్లాంట్ ?

దిశ, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లాలో మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ ముందుకు వచ్చింది. కంపెనీ ప్రతినిధులు ఇవాళ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయాన్ని సీఎం సంస్థ ప్రతినిధులకు తెలియజేశారు. ఐఎంఆర్‌ కూడా మరొక స్టీల్‌ప్లాంట్‌ పెడితే చక్కటి పారిశ్రామిక […]

Update: 2020-03-05 08:12 GMT

దిశ, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లాలో మరో భారీ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ ముందుకు వచ్చింది. కంపెనీ ప్రతినిధులు ఇవాళ సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయాన్ని సీఎం సంస్థ ప్రతినిధులకు తెలియజేశారు. ఐఎంఆర్‌ కూడా మరొక స్టీల్‌ప్లాంట్‌ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, ఇండస్ట్రీస్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్, ఐఎంఆర్‌ ఏజీ చైర్మన్‌ హాన్స్‌ రడాల్ఫ్‌ వైల్డ్, కంపెనీ డైరెక్టర్‌ అనిరుద్‌ మిశ్రా, సెడిబెంగ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ సీఈఓ అనీష్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

tag; cm jagan, imr ag, steel plant, kadapa

Tags:    

Similar News