’జిల్లా కలెక్టర్లకు జైలు శిక్ష సబబే‘

దిశ సిద్దిపేట: సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు గౌరవ హైకోర్టు జైలు శిక్ష విధించడం సబబే అని హైకోర్టు ఇచ్చిన తీర్పును లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాసు స్వాగతించాడు. చట్టాలు తెలిసిన IAS అధికారులే అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు వత్తి అవినీతి, అక్రమాలలో పాలు పంచుకొంటున్న వారితో చేతులు కలిపి అధికార దుర్వినియోగానికి పాల్పడడమే గాక గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఉద్దేశ్య పూర్వకంగా ఉల్లంఘించిన కలెక్టర్లకు జైలు శిక్ష […]

Update: 2021-03-10 04:11 GMT

దిశ సిద్దిపేట: సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు గౌరవ హైకోర్టు జైలు శిక్ష విధించడం సబబే అని హైకోర్టు ఇచ్చిన తీర్పును లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాసు స్వాగతించాడు. చట్టాలు తెలిసిన IAS అధికారులే అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు వత్తి అవినీతి, అక్రమాలలో పాలు పంచుకొంటున్న వారితో చేతులు కలిపి అధికార దుర్వినియోగానికి పాల్పడడమే గాక గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఉద్దేశ్య పూర్వకంగా ఉల్లంఘించిన కలెక్టర్లకు జైలు శిక్ష విధించడం సరైనదన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటె ఇతర జిల్లాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు అని ఆయన అన్నారు.

ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును జీతంగా తీసుకొంటున్న అధికారులు ప్రజల పక్షాన ఉండాలసింది పోయి, ప్రభుత్వంలోని కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులకు హైకోర్టు ఇచ్చిన తీర్పు హెచ్చరిక వంటిదని తుమ్మనపల్లి అన్నారు. ఇకనైనా అధికారులు ఎవరైనా చట్టం పరిధిలో మాత్రమే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని పలు అంశాలపై బాధితులు కోర్టుకు వెల్లేలా అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సర్వం కోల్పోయిన భూనిర్వాసితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పున: సమీక్ష చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News