వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.8 వేల కోట్లు
దిశ, ఏపీ బ్యూరో: రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ పరిధిలోని పేరూరు వద్ద ఏపీఎస్పీడీసీఎల్ సెక్షన్ కార్యాలయాన్ని చెవిరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం సబ్ స్టేషన్‌లో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, రైతులకు, పారిశ్రామిక రంగానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని […]
దిశ, ఏపీ బ్యూరో: రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ పరిధిలోని పేరూరు వద్ద ఏపీఎస్పీడీసీఎల్ సెక్షన్ కార్యాలయాన్ని చెవిరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం సబ్ స్టేషన్‌లో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, రైతులకు, పారిశ్రామిక రంగానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ విద్యుత్ కు సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే రూ.8 వేల కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని చెప్పారు.