ఉదయాన్నే వీటిని తింటే మీ ఇమ్యూనిటీ లెవల్స్‌కు తిరుగుండదు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి దేశాన్నే కాదు యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇమ్యూనిటీ లెవల్స్ (రోగనిరోధక శక్తి) మీద శ్రద్ధ పెట్టకుండా జంక్ ఫుడ్ తీసుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ తమ రోగ నిరోధక శక్తిని మెరుగు పరుచుకోవడం తప్పని సరి అంటున్నారు నిపుణులు. పరిగడుపున వీటిని తినడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎంతో తోడ్పడతాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి దేశాన్నే కాదు యావత్తు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇమ్యూనిటీ లెవల్స్ (రోగనిరోధక శక్తి) మీద శ్రద్ధ పెట్టకుండా జంక్ ఫుడ్ తీసుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ తమ రోగ నిరోధక శక్తిని మెరుగు పరుచుకోవడం తప్పని సరి అంటున్నారు నిపుణులు. పరిగడుపున వీటిని తినడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎంతో తోడ్పడతాయి. అవేంటో చూసేద్దాం..
తేనె : వర్షాకాలం మొదలైంది. వాతవరణంలో మార్పులు జరిగినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి అవసరం. తేనె మీ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఒక బూస్టర్లా పనిచేస్తుంది. ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దగ్గును తగిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశం తక్కువ, ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడుతుంది. గుండె సంబంధిత జబ్బులు రాకుండా పోరాడుతుంది.
వెల్లుల్లి: భారతీయ వంటల్లో ముఖ్యంగా వాడేది వెల్లుల్లి. ఇంట్లో పెద్దల్లు సైతం వెల్లుల్లి తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతూనే ఉంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకటి, రెండు వెల్లుల్లి పాయలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కిడ్నీలో ఇన్‌ఫెక్షన్స్, యూటీఐ వంటి సమస్యలకు రాకుండా ఉపయోగపడుతుంది. మన అవయవాలను సరిగ్గా పనిచేసేలా ప్రేరేపించుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి రిలీఫ్ చేస్తుంది.
ఉసిరి: పరిగడుపునే ఉసిరి తురుము నీటిలో కలిపి తాగడం వల్ల వాత, పిత్త, కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది. ఉసిరిలో విటమిన్ సీ పుష్కలంగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. దీనితో పాటు మెటబాలిజంను పెంపొదిస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులు, గర్భవతులు, డయాబెటిక్, హై బీపీ ఉన్న వారు వైద్యులు సూచనల మేరకు ఉసిరి తీసుకొవాలి.