SRSP కెనాల్ నుంచి మట్టి తరలింపు.. అడ్డుకున్న ఎంపీపీ సౌజన్య (వీడియో)
దిశ, గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకుల వద్దనున్న ఎస్సారెస్పీ కాలువ నుండి అక్రమంగా మట్టిని తరలిస్తుండగా సోమవారం గీసుగొండ ఎంపీపీ సౌజన్య అడ్డుకున్నారు. అయినా, వారు వాహనాలు ఆపకపోవడంతో రెవెన్యూ అధికారులు వచ్చేవరకూ ఎంపీపీ దారికి అడ్డుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో మట్టి తరలించే వారికి, ఎంపీపీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ డీఈ గణేష్ మట్టి తరలిస్తున్న వాహనాలు ఆపి, కెనాల్ నుంచి మట్టి […]
దిశ, గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనాయమాకుల వద్దనున్న ఎస్సారెస్పీ కాలువ నుండి అక్రమంగా మట్టిని తరలిస్తుండగా సోమవారం గీసుగొండ ఎంపీపీ సౌజన్య అడ్డుకున్నారు. అయినా, వారు వాహనాలు ఆపకపోవడంతో రెవెన్యూ అధికారులు వచ్చేవరకూ ఎంపీపీ దారికి అడ్డుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో మట్టి తరలించే వారికి, ఎంపీపీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ డీఈ గణేష్ మట్టి తరలిస్తున్న వాహనాలు ఆపి, కెనాల్ నుంచి మట్టి తరలించడానికి పర్మిషన్ లేదని అన్నారు.
అనంతరం ఈ సందర్భంగా ఎంపీపీ సౌజన్య మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు మరియు అధికారుల అండదండలతోనే గత ఐదునెలలుగా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని అన్నారు. గత ఐదునెలలుగా దాదాపు 30 వేల ట్రిప్పుల మట్టిని వరంగల్ సిటీకి ప్లాట్ల కోసం తరలిస్తున్నారని ఆరోపించారు. అధికారుల కళ్ల ఎదుటే ఇంత జరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. అంనతరం గీసుగొండ సీఐ రాయల వెంకటేశ్వర్లు మట్టి తరలిస్తున్న వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేనందున కేసు నమోదు చేశారు. ఎంపీపీ సౌజన్యతో పాటు వంచనగిరి ఎంపీటీసీ రజిత, సారంగం తదితరులు పాల్గొన్నారు.