నేషనల్ హైవే పేరుతో అక్రమ రవాణా
దిశ, సూర్యాపేట: జాతీయ రహదారి పేరుతో ప్రైవేట్ వారికి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని తెలుసుకున్న స్థానిక ఎంఆర్ఓ రెండు టిప్పర్‌లను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. చివ్వేల మండల పరిధిలోని బండమీది చందుపట్ల గ్రామ సమీపంలో మట్టిని తరలిస్తున్న 2 టిప్పర్లను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారని నిలదీయడంతో జాతీయ రోడ్డు పనులకు అని డ్రైవర్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇది గ్రహించిన ఎంఆర్‌ఓ వెంటనే పోలీసులను పిలిపించి […]
దిశ, సూర్యాపేట: జాతీయ రహదారి పేరుతో ప్రైవేట్ వారికి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని తెలుసుకున్న స్థానిక ఎంఆర్ఓ రెండు టిప్పర్‌లను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది. చివ్వేల మండల పరిధిలోని బండమీది చందుపట్ల గ్రామ సమీపంలో మట్టిని తరలిస్తున్న 2 టిప్పర్లను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారని నిలదీయడంతో జాతీయ రోడ్డు పనులకు అని డ్రైవర్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇది గ్రహించిన ఎంఆర్‌ఓ వెంటనే పోలీసులను పిలిపించి నిందితులను అరెస్ట్ చేయించారు. కాగా, ఇదే సమయంలో మొత్తం 6 టిప్పర్లు, ఒక జేసీబీ ఉండగా 2 టిప్పర్లను మాత్రమే పోలీసులకు అప్పగించడం గమనార్హం. మిగతా 4 టిప్పర్లు, జేసీబీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.