నదిమార్గంలో అక్రమంగా మద్యం తరలింపు

దిశ, మహబూబ్‎నగర్: ఏపీలో మద్యం ధరలు అధికంగా పెంచడంతో అక్రమార్కుల చూపు కాస్త తెలంగాణపై పడింది. దీంతో ఇక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని ఏపీలో అధిక ధరలకు అమ్ముకుని పలువురు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు తెరలేపిన వారిపై పోలీసులు కూడా కొరడా ఝులిపించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని నది తీరం మీదుగా కర్నూలుకు మద్యాన్ని తరలిస్తున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఒక ఆటో, 7 బైక్‌లు, రూ. 1 […]

Update: 2020-05-14 11:22 GMT

దిశ, మహబూబ్‎నగర్: ఏపీలో మద్యం ధరలు అధికంగా పెంచడంతో అక్రమార్కుల చూపు కాస్త తెలంగాణపై పడింది. దీంతో ఇక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని ఏపీలో అధిక ధరలకు అమ్ముకుని పలువురు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు తెరలేపిన వారిపై పోలీసులు కూడా కొరడా ఝులిపించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని నది తీరం మీదుగా కర్నూలుకు మద్యాన్ని తరలిస్తున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఒక ఆటో, 7 బైక్‌లు, రూ. 1 లక్ష 75 వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News