గమనిక.. ప్రజలెవ్వరూ అవి కొనొద్దు

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లు, వెంచర్ల పై మున్సిపల్ అధికారులు కొరడా ఝలిపిచారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇండస్ట్రియల్ జోన్ లో వెంచర్లు చేపడుతూ వాటి రిజిస్ట్రేషన్లను చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పెవిలియన్ వెంచర్ ను సోమవారం కూల్చవేస్తామని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. సదాశివపేట పట్టణంలో అటువంటి అక్రమ లేఅవుట్లు అన్నింటి మీద చర్యలకు పూనుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. ప్రజలెవ్వరూ […]

Update: 2020-07-13 04:36 GMT

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లు, వెంచర్ల పై మున్సిపల్ అధికారులు కొరడా ఝలిపిచారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇండస్ట్రియల్ జోన్ లో వెంచర్లు చేపడుతూ వాటి రిజిస్ట్రేషన్లను చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పెవిలియన్ వెంచర్ ను సోమవారం కూల్చవేస్తామని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. సదాశివపేట పట్టణంలో అటువంటి అక్రమ లేఅవుట్లు అన్నింటి మీద చర్యలకు పూనుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. ప్రజలెవ్వరూ పర్మిషన్ లేనటువంటి చోట్లలో స్థలాలు కొన వద్దని, మోసపోవద్దని కమిషనర్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఎం . హనుమంతరావు ఆదేశాల మేరకు ఇంకా నిబద్ధతతో పని చేస్తామని, నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు.

Tags:    

Similar News