అక్రమ గ్రావెల్ తవ్వకాలు.. పట్టించుకోని అధికార యంత్రాంగం
దిశ, వాజేడు: అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపి ఇసుక ర్యాంపు రహదారి నిర్మాణానికి తరలిస్తున్నప్పటికీ.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అధికారుల అండదండలు తోడవడంతో పట్టపగలే అక్రమంగా వందలాది టిప్పర్ల గ్రావెల్ తరలిస్తున్నారు. ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల పరిధిలోని కొండాపురం గ్రామం సరిహద్దులో గల భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకాసురులు ఇసుక ర్యాంపు నిర్వహణ కోసం రహదారి నిర్మించేందుకు గ్రావెల్ రవాణా చేస్తున్నారు. లక్షల విలువచేసే గ్రావెల్ పట్టపగలే అధికారుల కనుసన్నల్లో అక్రమంగా […]
దిశ, వాజేడు: అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపి ఇసుక ర్యాంపు రహదారి నిర్మాణానికి తరలిస్తున్నప్పటికీ.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అధికారుల అండదండలు తోడవడంతో పట్టపగలే అక్రమంగా వందలాది టిప్పర్ల గ్రావెల్ తరలిస్తున్నారు. ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల పరిధిలోని కొండాపురం గ్రామం సరిహద్దులో గల భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకాసురులు ఇసుక ర్యాంపు నిర్వహణ కోసం రహదారి నిర్మించేందుకు గ్రావెల్ రవాణా చేస్తున్నారు. లక్షల విలువచేసే గ్రావెల్ పట్టపగలే అధికారుల కనుసన్నల్లో అక్రమంగా తరలిస్తున్నారు.
ఈ అక్రమ గ్రావెల్‌తో రామానుజపురం ఇసుక ర్యాంపుకు రహదారి నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నప్పటికీ.. సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలు జరపాలంటే ప్రభుత్వ అనుమతులు పొంది ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ.. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి లక్షల విలువచేసే గ్రావెల్ లో అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమానికి గురవుతున్న ప్రభుత్వ ప్రకృతి సంపదను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.