ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు.. చర్యలేవి..?
దిశ ఖమ్మం టౌన్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి. రూల్స్ ప్రకారం భవన నిర్మాణం చేపట్టాలి అంటే 200 గజాల స్థలం పైబడిన వారు ఖమ్మం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తీసుకున్న నిర్మాణాలు ఖమ్మంలో మచ్చుకు మాత్రమే కనబడుతున్నాయి. యాక్టుకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపితే ఆ బిల్డింగ్లను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు కూల్చివేసే అధికారం కూడా ఉంటుంది. కానీ […]
దిశ ఖమ్మం టౌన్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి. రూల్స్ ప్రకారం భవన నిర్మాణం చేపట్టాలి అంటే 200 గజాల స్థలం పైబడిన వారు ఖమ్మం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తీసుకున్న నిర్మాణాలు ఖమ్మంలో మచ్చుకు మాత్రమే కనబడుతున్నాయి. యాక్టుకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపితే ఆ బిల్డింగ్లను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు కూల్చివేసే అధికారం కూడా ఉంటుంది.
కానీ ఖమ్మం నడిబొడ్డులో కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మామిళ్ల గూడెంలో ఓ ఇంటి యజమానికి ఇవేమీ పట్టి నట్లు లేదు. గత అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇచ్చిన అనుమతులు బేఖాతర్ చేస్తూ సిల్ట్ ప్లస్ రెండు ఫ్లోర్లు నిర్మాణము చేయాలని రూల్ ఉంటే.. అంతకంటే ఎక్కువే నిర్మాణం చేస్తుండటం గమనార్హం. బహిరంగంగా ఇంత పెద్ద నిర్మాణం జరిపేటప్పుడు అన్ని అనుమతులు తప్పక ఉండాలి. కానీ ఇదేంటో టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫ్లోరుకు రూ.లక్షల్లో సమర్పించిన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సెల్లర్, మరో రెండు ఫ్లోర్లు అదనంగా వేయడం గమనార్హం. ఇప్పటికైనా ఖమ్మం నగరంలో జరిగే ఇలాంటి అక్రమ నిర్మాణాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.