శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: శంషాబాద్ పట్టణంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ అధికారులు కూడా కొరడా ఝుళిపించారు. పట్టణంలోని ఉట్‌పల్లి, రాయల్ విల్లా, రాళ్లగుడ, తొండుపల్లిలో అక్రమ నిర్మాణాలను పట్టణ ప్రణాళిక అధికారి రాంచందర్ ఆధ్వర్యంలో జేసీబీలు, కంప్రెసర్ల సహాయంతో కూల్చి వేశారు. ఈ క్రమంలో కొందరు నిర్మాణదారులు గతంలో తమకు పంచాయతీ నుంచి అనుమతులు ఇచ్చారని, నిర్మాణాలను ఎందుకు కూలదోస్తున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీవో అమల్లో ఉన్నందునా ఎలాంటి నిర్మాణాలు, […]
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: శంషాబాద్ పట్టణంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ అధికారులు కూడా కొరడా ఝుళిపించారు. పట్టణంలోని ఉట్‌పల్లి, రాయల్ విల్లా, రాళ్లగుడ, తొండుపల్లిలో అక్రమ నిర్మాణాలను పట్టణ ప్రణాళిక అధికారి రాంచందర్ ఆధ్వర్యంలో జేసీబీలు, కంప్రెసర్ల సహాయంతో కూల్చి వేశారు. ఈ క్రమంలో కొందరు నిర్మాణదారులు గతంలో తమకు పంచాయతీ నుంచి అనుమతులు ఇచ్చారని, నిర్మాణాలను ఎందుకు కూలదోస్తున్నారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 111 జీవో అమల్లో ఉన్నందునా ఎలాంటి నిర్మాణాలు, వెంచర్లకు అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. కూల్చివేసిన అక్రమ నిర్మాణాలు తిరిగి నిర్మిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.