అలా జరిగినట్టు తెలిస్తే.. రీ పోలింగ్
దిశ, నాగర్ కర్నూల్: మండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు హరిప్రీత్ సింగ్ అన్నారు. ఈరోజు కలెక్టరేట్‌లో కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్, నోడల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లతో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. ఏదైనా కేంద్రంలో రిగ్గింగ్ జరిగితే మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ఒకరు వేయాల్సిన ఓటు వేరొకరు వేసినట్లు రుజువైతే ఆ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, ఎంత […]
దిశ, నాగర్ కర్నూల్: మండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు హరిప్రీత్ సింగ్ అన్నారు. ఈరోజు కలెక్టరేట్‌లో కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్, నోడల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లతో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. ఏదైనా కేంద్రంలో రిగ్గింగ్ జరిగితే మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
ఒకరు వేయాల్సిన ఓటు వేరొకరు వేసినట్లు రుజువైతే ఆ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌కు 12డి ఫారంలు ఇచ్చారు, ఎన్నికల నియమావళిని ఏవిధంగా అమలు చేస్తున్నారు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెటీరియల్ మేనేజ్‌మెంట్ ఎవరు చూస్తున్నారనే అనేక అంశాలపై నోడల్ అధికారులను ప్రశ్నించారు.
పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్లు, నోడల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో డాగ్ స్క్వాడ్, భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు.