ఇంటర్‌లో పాస్‌ మార్కులు వస్తే అన్ని ప్రవేశాలకు అర్హులే…

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సర్కార్ వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్‌లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించనుంది. వృత్తి విద్యాకోర్సుల్లో చేరేందుకు రాష్ట్రంలో 7 రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్‌డ్‌ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధించాల్సిందిగా నిబంధనలు ఉండేవి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించకుండానే గతంలో సాధించిన మార్కుల ఆధారంగా, కనీస మార్కులతో పాస్‌ […]

Update: 2021-08-23 11:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సర్కార్ వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్‌లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించనుంది. వృత్తి విద్యాకోర్సుల్లో చేరేందుకు రాష్ట్రంలో 7 రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్‌డ్‌ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధించాల్సిందిగా నిబంధనలు ఉండేవి.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించకుండానే గతంలో సాధించిన మార్కుల ఆధారంగా, కనీస మార్కులతో పాస్‌ చేశారు. కనీస మార్కుల నిబంధనతో పాసైన వారంతా ప్రవేశ పరీక్షలకు అర్హతను కోల్పోవలసి వస్తుంది. ఈ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం కనీస మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం అన్నిరకాల కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు.

Tags:    

Similar News