విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకోం..

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులందరికీ టీకా వేసిన తర్వాతే పాఠశాలలు ప్రారంభించాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. థర్డ్ వేవ్ విద్యార్థులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారని, ఈ సమయంలో విద్యాసంస్థలు ప్రారంభించడం సమంజసం కాదని, ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి […]

Update: 2021-06-20 08:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులందరికీ టీకా వేసిన తర్వాతే పాఠశాలలు ప్రారంభించాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని కోరారు. థర్డ్ వేవ్ విద్యార్థులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారని, ఈ సమయంలో విద్యాసంస్థలు ప్రారంభించడం సమంజసం కాదని, ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణ యువత బతికి ఉంటేనే బంగారు తెలంగాణను సాధించగలమన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకపోతే రోడ్లపై అధికార పార్టీ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. జూలై 1 నుంచి స్కూల్స్, కాలేజీలు ప్రారంభిస్తే ఎన్ఎస్‌యూఐ తరఫున అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కరోనా ఫస్ట్ వేవ్ లోనే అందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సెకండ్ వేవ్ విజృంభించిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ టీకా వేసి థర్డ్ వేవ్ రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

 

Tags:    

Similar News