కరోనా పాజిటివ్ అయితే వ్యాక్సిన్ వేయించుకోనవసరం లేదట..

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఒక్క రోజులోనే లక్ష కేసులు నమోదు కావడం భయాందోళనలకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి టీకా మాత్రమే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కరోనా టీకాను వేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ పై చాలామందికి చాలా అనుమానాలే ఉన్నాయి. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్నాకా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తొలి డోసు వ్యాక్సిన్‌ తర్వాత […]

Update: 2021-04-22 01:01 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఒక్క రోజులోనే లక్ష కేసులు నమోదు కావడం భయాందోళనలకు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి టీకా మాత్రమే పరిష్కారమని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కరోనా టీకాను వేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ పై చాలామందికి చాలా అనుమానాలే ఉన్నాయి. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్నాకా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తొలి డోసు వ్యాక్సిన్‌ తర్వాత పాజిటివ్‌ వస్తే రెండో డోసు తీసుకోవచ్చా? అన్న అనుమానాలు చాలామందిలో తలెత్తుతున్నాయి. ఇలాంటి అనుమానాలపై చర్చించి వైద్య నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

కరోనా నుంచి కోలుకున్నాకా వ్యాక్సిన్ అవసరం లేదని వైద్య నిపుణులు తేల్చి చెప్తున్నారు. కరోనా పాజిటివ్‌ అయిన వారు వ్యాక్సిన్‌ కోసం తొందర పడాల్సిన అవసరం లేదని, కనీసం 8 వారాల వ్యాక్సిన్ తీసుకోకుండా ఆగవచ్చని చెప్తున్నారు. ఈ దశలో యాంటీ బాడీస్ శరీరంలో ఉత్పన్నం అవుతాయని, దీని వలన శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని తెలిపారు.

Tags:    

Similar News