అలా అని మీరు నిరూపిస్తే నేనే 'టెస్లా'ను మూసేస్తా
దిశ,వెబ్‌డెస్క్: టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కంపెనీపై వస్తున్న ఆరోపణలు నిజమైతే టెస్లాను శాశ్వతంగా మూసివేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిగ్గా మారింది. అమెరికా తరువాత చైనాలోని షాంఘై అనే ప్రాంతంలో టెస్లా కార్ల తయారీ సంస్థ ఉంది. చైనా మార్కెట్ లో అతిపెద్ద కార్ల సంస్థ టెస్లానే. అయితే టెస్లా కార్లకు ఏర్పాటు చేసిన కెమెరా జీపీఎస్, రాడార్‌లను అగంతకులు యాక్సెస్ చేస్తే దేశ […]
దిశ,వెబ్‌డెస్క్: టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కంపెనీపై వస్తున్న ఆరోపణలు నిజమైతే టెస్లాను శాశ్వతంగా మూసివేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిగ్గా మారింది.
అమెరికా తరువాత చైనాలోని షాంఘై అనే ప్రాంతంలో టెస్లా కార్ల తయారీ సంస్థ ఉంది. చైనా మార్కెట్ లో అతిపెద్ద కార్ల సంస్థ టెస్లానే. అయితే టెస్లా కార్లకు ఏర్పాటు చేసిన కెమెరా జీపీఎస్, రాడార్‌లను అగంతకులు యాక్సెస్ చేస్తే దేశ సైనిక రహస్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే చైనా సైనిక పరిసర ప్రాంతాల్లో ఎలన్ మస్క్ కు సంబంధించిన కార్ల సంస్థ టెస్లాపై నిషేదం విధించాయి.
అదే సమయంలో శనివారం జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఎలన్ మస్క్ మాట్లాడుతూ టెస్లా కార్ల నిషేదంపై స్పందించారు. చైనాలో టెస్లా కార్లను గూఢచర్యానికి ఉపయోగిస్తున్నట్లు తేలితే తన కంపెనీని పర్మినెటంట్ గా మూసి వేస్తామని ప్రకటించారు.