హిడ్మాను పట్టిస్తే రూ. 7 లక్షలు

న్యూఢిల్లీ : మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఎ) బెటాలియన్ 1ను నడిపిస్తున్న సేనాని మడ్వి హిడ్మాను పట్టిస్తే రూ. 7 లక్షల నగదు రివార్డు అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలే సుకుమా-బీజాపూర్ మావోయిస్టుల దాడిలో 22 మంది భద్రతా దళాలను హతమార్చిన దాడిని రచించింది హిడ్మానే కావడం గమనార్హం. ఈ దాడికి బదులు తీర్చుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, భద్రతా దళాలు అందుకు తగిన ప్రణాళికలను […]

Update: 2021-04-18 05:02 GMT

న్యూఢిల్లీ : మావోయిస్టు అగ్ర నాయకుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఎ) బెటాలియన్ 1ను నడిపిస్తున్న సేనాని మడ్వి హిడ్మాను పట్టిస్తే రూ. 7 లక్షల నగదు రివార్డు అందజేస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలే సుకుమా-బీజాపూర్ మావోయిస్టుల దాడిలో 22 మంది భద్రతా దళాలను హతమార్చిన దాడిని రచించింది హిడ్మానే కావడం గమనార్హం. ఈ దాడికి బదులు తీర్చుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, భద్రతా దళాలు అందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హిడ్మాపై భారీ నగదు రివార్డు ప్రకటించాయి. 2019లో ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే భీమా మండవిని చంపిన కేసులోనూ హిడ్మాపై రివార్డు ఉంది.

Tags:    

Similar News