IDBI లావాదేవీ సలహాదారు కోసం ఏడు సంస్థల పోటీ..

దిశ, వెబ్‌డెస్క్: ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంక్ విక్రయాలను నిర్వహించేందుకు జేఎమ్ ఫైనాన్షియల్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, డెలాయిట్ సహా ఏడు సంస్థలు బిడ్ వేసినట్టు తెలుస్తోంది. లావాదేవీల సలహాదారుగా వ్యవహరించడానికి ఈ సంస్థలు బిడ్‌లను దాఖలు చేశాయి. దీపమ్ నోటీసుల ప్రకారం.. ఈ సంస్థలు ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియకు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం(దీపమ్) ముందు వర్చువల్‌గా ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. దీని తర్వాత ఐడీబీఐ […]

Update: 2021-08-08 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో బ్యాంక్ విక్రయాలను నిర్వహించేందుకు జేఎమ్ ఫైనాన్షియల్, ఎర్నెస్ట్ అండ్ యంగ్, డెలాయిట్ సహా ఏడు సంస్థలు బిడ్ వేసినట్టు తెలుస్తోంది. లావాదేవీల సలహాదారుగా వ్యవహరించడానికి ఈ సంస్థలు బిడ్‌లను దాఖలు చేశాయి. దీపమ్ నోటీసుల ప్రకారం.. ఈ సంస్థలు ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియకు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం(దీపమ్) ముందు వర్చువల్‌గా ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. దీని తర్వాత ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక విక్రయం కోసం దీపమ్ ఒక లావాదేవీ సలహాదారున్ని నియమిస్తుంది.

ఈ లావాదేవీ సలహదారు కోసం దీపమ్ పలు కన్సల్టింగ్ సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు, మర్చంట్ బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి బిడ్‌లను ఆహ్వానించాయి. దీనికి జూలై 22 వరకు గడువును పొడిగించాయి. సలహాదారుగా నియమించబడే సంస్థ ఐడీబీఐ బ్యాంకులో విక్రయానికి సంబంధించిన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ-డేటా రూమ్ ఏర్పాటులో ఐడీబీఐ బ్యాంకుకు సహాయంగా ఉండనుంది. రోడ్‌షోలను నిర్వహిచేందుకు, కొనేందుకు వచ్చే సంస్థలకు ఆసక్తి పెంపొందించేలా ప్రణాళికను అందించనున్నట్టు సమాచారం.

కాగా, ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి, ఎల్‌ఐసీకి కలిపి 94 శాతానికి పైగా వాటా ఉంది. 49.21 శాతం వాటాతో ఎల్‌ఐసీ ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్‌లో యాజమాన్య నియంత్రణ కలిగిన ప్రమోటరుగా ఉంది. నాన్-ప్రమోటర్ వాటా 5.29 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News