వ్యాక్సిన్ పై ఐసీఎంఆర్ కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుండటంతో.. పలు దేశాలు దానికి వ్యాక్సిన్ కనుగొనటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్న భారత్ ఆ దిశగా పరిశోధక సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ప్రాథమిక దశను అధిగమించిన భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్‌కు, జైడస్ కాడిలా హెల్త్ కేర్ తయారు చేసిన మరో వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ కోసం ఆగమేఘాలపై అనుమతులు ఇవ్వడం ఈ కోవలోకే […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తుండటంతో.. పలు దేశాలు దానికి వ్యాక్సిన్ కనుగొనటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్న భారత్ ఆ దిశగా పరిశోధక సంస్థలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ప్రాథమిక దశను అధిగమించిన భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్‌కు, జైడస్ కాడిలా హెల్త్ కేర్ తయారు చేసిన మరో వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ కోసం ఆగమేఘాలపై అనుమతులు ఇవ్వడం ఈ కోవలోకే వస్తుంది. తాజాగా దీనిపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పందించింది. భారత్ లో మానవులపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయని వెల్లడించింది. ఓ వ్యాక్సిన్ తయారీకి అత్యంత కీలకంగా భావించే ఈ ప్రక్రియలో దాదాపు 1000 మంది పాల్గొంటున్నారని తెలిపింది. రెండు దశల్లో జరిగే ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలపై భారత్ మాత్రమే కాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ లో కరోనా వ్యాక్సిన్ కోసం అనేక పరిశోలధనలు జరిగినా, ఇప్పటివరకు ఆశించిన పురోగతి చూపించింది భారత్ బయోటెక్, జైడస్ కాడిలా మాత్రమే. దాంతో ఈ రెండింటికే క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇచ్చారు.