ICICI ఈడీగా సందీప్ బాత్రా నియామకం!
దిశ, వెబ్‌డెస్క్ : ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సందీప్ బాత్రాను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆమోదించినట్టు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. సందీప్ బాత్రా మూడేళ్ల కాలానికి ఈ పదవిలో బాధ్యతలు నిర్వహిస్తారని, తక్షణమే ఆయన బాధ్యతలు అమల్లోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు స్పష్టం చేశారు. సందీప్ బాత్రా రెండు దశాబ్దాలుగా ఐసీఐసీఐ గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కంపెనీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదేవిధంగా బ్యాంకు ఆపరేషన్స్ గ్రూప్, […]
దిశ, వెబ్‌డెస్క్ : ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సందీప్ బాత్రాను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆమోదించినట్టు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. సందీప్ బాత్రా మూడేళ్ల కాలానికి ఈ పదవిలో బాధ్యతలు నిర్వహిస్తారని, తక్షణమే ఆయన బాధ్యతలు అమల్లోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు స్పష్టం చేశారు. సందీప్ బాత్రా రెండు దశాబ్దాలుగా ఐసీఐసీఐ గ్రూప్‌తో కలిసి పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన కంపెనీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదేవిధంగా బ్యాంకు ఆపరేషన్స్ గ్రూప్, టెక్నాలజీ గ్రూప్, కార్పొరేట్ కమ్యూనికేషన్ గ్రూపలతో సహా బ్యాంకు కార్పొరేట్ సెంటర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో సహా ఐసీఐసీఐ గ్రూప్ కంపెనీల బోర్డులలో ఆయన సభ్యులుగా ఉన్నారు.