టీమిండియా విజయం చారిత్రాత్మకం.. 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారు: ప్రధాని మోడీ ఎమోషనల్ కామెంట్స్
17 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, సౌతాఫ్రికాను మట్టికరిపించి టైటిల్‌ను చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: 17 ఏళ్ల సుధీర్ఘ విరామం తరువాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, సౌతాఫ్రికాను మట్టికరిపించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే, భారత్ విజయం సాధించడం పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అటు సోషల్ మీడియాలో.. ఇటు ప్రత్యక్షంగా మీడియా ముందుకు వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రపంచ అత్యుత్తమ టోర్నీలో భారత్ విజేతగా అవతరించడం చారిత్రాత్మకం అని అన్నారు. జట్టు సమష్టి ఆడి విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. భారత ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన చూసి దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారని అన్నారు.