టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా‌కు షాక్.. కీలక మ్యాచులో ఓడించి పగ తీర్చుకున్న ఆఫ్ఘానిస్తాన్

టీ20 వరల్డ్ కప్ లో పసికూనా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా కి భారీ షాక్ ఇచ్చింది. ఎస్టీ విన్‌సెంట్ వెదికగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది.

Update: 2024-06-23 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ లో పసికూనా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా కి భారీ షాక్ ఇచ్చింది. ఎస్టీ విన్‌సెంట్ వెదికగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. మ్యాక్స్‌వెల్ మినహా ఏ బ్యాటర్ ను కూడా క్రీజ్ లో నిలవకుండా అవుట్ చేశారు. దీంతో ఆఫ్ఘాన్ కేవలం 149 పరుగులను కాపాడుకొని ఆస్ట్రేలియా జట్టుపై 21 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో మేము కూడా ఉన్నామని సవాల్ విసిరింది. అలాగే ఆస్ట్రేలియా సెమీస్ ఆశలను ఆఫ్ఘన్ క్లిష్టతరం చేసింది. ఇదిలా ఉంటే వన్డే వరల్డ్ కప్ సెమిస్ మ్యాచులో ఆఫ్ఘాన్ ను ఓడించినందుకు ఆ జట్టు ఈ మ్యాచులో పగ తీర్చుకున్నారు. కాగా ఈ మ్యాచులో ఆఫ్ఘాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, గుల్బద్దిన్ నైబ్ 4, మహ్మద్ నబీ, రషిద్ ఖాన్, ఆజ్మతుల్లాలు చెరో వికెట్ తీసుకున్నారు.


Similar News