ఎమిరేట్స్ క్రికెటర్లపై తాత్కాలిక నిషేధం
దిశ, స్పోర్ట్స్ : మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యూఏఈ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆదివారం తాత్కాలిక నిషేధం విధించింది. యూఏఈకి చెందిన అమిర్ హయత్, అష్ఫాక్ అహ్మద్‌లు గత ఏడాది అక్టోబర్‌లో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) క్వాలిఫయర్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ (Match fixing) ఆరోపణలు ఎదుర్కోవడంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (Emirates Cricket Board) సస్పెండ్ చేసింది. వారిపై అధికారికంగా ఎలాంటి కేసులు నమోదు చేయకుండా […]
దిశ, స్పోర్ట్స్ : మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యూఏఈ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆదివారం తాత్కాలిక నిషేధం విధించింది. యూఏఈకి చెందిన అమిర్ హయత్, అష్ఫాక్ అహ్మద్‌లు గత ఏడాది అక్టోబర్‌లో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) క్వాలిఫయర్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ (Match fixing) ఆరోపణలు ఎదుర్కోవడంతో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (Emirates Cricket Board) సస్పెండ్ చేసింది. వారిపై అధికారికంగా ఎలాంటి కేసులు నమోదు చేయకుండా విచారణకు ఆదేశించింది.
కాగా సదరు ఆటగాళ్లను సెప్టెంబర్ 13 నుంచి 14 రోజుల్లోపు తమపై వచ్చిన ఆరోపణలపై తగిన వివరణ ఇవ్వాలని ఐసీసీ (ICC) ఆదేశించింది. ‘అమిర్, అష్ఫాక్‌లు ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. మ్యాచ్ ఫిక్స్ చేసేందుకు ఇతరుల నుంచి లంచం, బహుమబులు అందుకున్నారనే ఆరోపణలు వారిపై ఉన్నాయి.
బెట్టింగ్ నిర్వాహకులకు అనుకూలంగా వ్యవహరించినట్లు కూడా వారిపై ఫిర్యాదులు అందాయి. కాబట్టి వీటిపై వెంటనే వివరణ ఇవ్వాలి. అప్పటి వరకు తాత్కాలిక నిషేధం అమలులో ఉంటుంది’ అని ఐసీసీ పేర్కొంది. ఆ లోపు వాళ్లు తగిన వివరణ ఇవ్వలేకపోయినా, వారిచ్చిన వివరణతో ఐసీసీ సంతృప్తి చెందక పోవడంతో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.