తొలిసారిగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బంగ్లా బౌలర్లు

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేశారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య రెండో వన్డే ముగిసిన అనంతరం ఈ ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. కాగా, తొలి సారిగా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్ 10లో ఇద్దరు బంగ్లాదేశ్ బౌలర్లకు చోటు దక్కింది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన జస్ప్రిత్ బుమ్రా నాలుగో ర్యాంకు నుంచి 5వ ర్యాంకుకు పడిపోయాడు. కాగా.. బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మూడు స్థానాలను […]

Update: 2021-05-26 11:25 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేశారు. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య రెండో వన్డే ముగిసిన అనంతరం ఈ ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. కాగా, తొలి సారిగా వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్ 10లో ఇద్దరు బంగ్లాదేశ్ బౌలర్లకు చోటు దక్కింది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన జస్ప్రిత్ బుమ్రా నాలుగో ర్యాంకు నుంచి 5వ ర్యాంకుకు పడిపోయాడు. కాగా.. బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మూడు స్థానాలను ఎగబాకి రెండో స్థానానికి నిలిచాడు. తన కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. మరోవైపు బంగ్లా పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ మరోసారి టాప్ 10లోకి ప్రవేశించాడు. నాలుగు స్థానాలు మెరుగుపరుచుకున్న ముస్తఫిజుర్ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. మొత్తానికి తొలి సారిగా ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో ఇద్దరు బంగ్లాదేశ్ బౌలర్లు ఉండటం ఇదే తొలిసారి. బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో బాబర్ అజమ్ 1వ స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో కోహ్లీ, మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు.

వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్

1. ట్రెంట్ బౌల్ట్ (737 రేటింగ్ పాయింట్లు)
2. మెహదీ హసన్ మిరాజ్ (725)
3. ముజీబుర్ రెహ్మాన్ (708)
4. మాట్ హెన్రీ (691)
5. జస్ప్రిత్ బుమ్రా (690)
6. కగిసో రబాడ (666)
7. క్రిస్ వోక్స్ (665)
8. జోష్ హాజెల్‌వుడ్ (660)
9. ముస్తఫిజుర్ రెహ్మాన్ (652)
10. పాట్ కమిన్స్ (646)

Tags:    

Similar News