Cricket News: టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్: అలా జరిగితే రెండు జట్లు విజేతలే
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ డ్రా లేదా టై అయితే రెండు జట్లను విజేతలుగా ప్రకటిస్తామంది. అలాగే మరో రోజును రిజర్వ్ డే జాబితాలో చేర్చింది. ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఐదు రోజుల్లో మ్యాచ్‌కు ఏదైనా అవంతరాలు, ఇబ్బందులు ఎదురైతే.. ఆరో రోజు నిర్వహించే వెసులుబాటు కల్పించింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంస్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 మధ్య ఇండియా-న్యూజిలాండ్‌లు ఫైనల్‌లో తలబడనున్నాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ డ్రా లేదా టై అయితే రెండు జట్లను విజేతలుగా ప్రకటిస్తామంది. అలాగే మరో రోజును రిజర్వ్ డే జాబితాలో చేర్చింది. ఇప్పటివరకు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఐదు రోజుల్లో మ్యాచ్‌కు ఏదైనా అవంతరాలు, ఇబ్బందులు ఎదురైతే.. ఆరో రోజు నిర్వహించే వెసులుబాటు కల్పించింది.
ఇంగ్లాండ్‌లోని సౌతాంస్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 మధ్య ఇండియా-న్యూజిలాండ్‌లు ఫైనల్‌లో తలబడనున్నాయి. కరోనా ప్రభావం క్రమంలో ప్రతిరోజు 4 వేల మందిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.