WTC: ఐసీసీతో జతకట్టిన ఫేస్‌బుక్

దిశ, స్పోర్ట్స్: అరంగేట్రం డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ఐసీసీ, ఫేస్‌బుక్ జట్టుకట్టాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఫైనల్ ‌మ్యాచ్‌కు సంబంధించిన రీకాప్, హైలైట్స్, ఎక్స్‌క్లూసీవ్ వీడియోలు ఫేస్‌బుక్ వాచ్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. భారత ఉపఖండంలో ఐసీసీకి డిజిటల్ కంటెంట్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నఫేస్‌బుక్ ద్వారా క్రికెట్ అభిమానులు ఈ కంటెంట్‌తో పాటు వీడియో ఆన్ డిమాండ్ నుంచి ప్రత్యేకమైన వీడియోలు కూడా చూసే వీలుంటుంది. ఐసీసీ ఫేస్‌బుక్ పేజీలో వీడియో ఆన్ డిమాండ్ […]

Update: 2021-06-17 11:07 GMT

దిశ, స్పోర్ట్స్: అరంగేట్రం డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ఐసీసీ, ఫేస్‌బుక్ జట్టుకట్టాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఫైనల్ ‌మ్యాచ్‌కు సంబంధించిన రీకాప్, హైలైట్స్, ఎక్స్‌క్లూసీవ్ వీడియోలు ఫేస్‌బుక్ వాచ్ ద్వారా ప్రసారం చేయనున్నట్లు ఐసీసీ తెలిపింది. భారత ఉపఖండంలో ఐసీసీకి డిజిటల్ కంటెంట్ భాగస్వామిగా వ్యవహరిస్తున్నఫేస్‌బుక్ ద్వారా క్రికెట్ అభిమానులు ఈ కంటెంట్‌తో పాటు వీడియో ఆన్ డిమాండ్ నుంచి ప్రత్యేకమైన వీడియోలు కూడా చూసే వీలుంటుంది. ఐసీసీ ఫేస్‌బుక్ పేజీలో వీడియో ఆన్ డిమాండ్ ఆప్షన్ ఉంటుందని పేర్కొన్నది. మ్యాచ్ వీడియోలను ఇతరులతో షేర్ చేసుకునే వీలుందని ఫేస్‌బుక్ చెప్పింది.

Tags:    

Similar News