Reels are crazy : రీల్స్ పిచ్చి..విద్యుత్ వైర్లతో చెలగాటం!

రీల్స్ పిచ్చి(Reels are crazy)లో యువత(Youth) ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నప్పటికి గుణపాఠాలు నేర్వడం లేదు.

Update: 2024-12-26 05:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : రీల్స్ పిచ్చి(Reels are crazy)లో యువత(Youth) ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నప్పటికి గుణపాఠాలు నేర్వడం లేదు. వెలం వెర్రిగా మారిన రీల్స్ పిచ్చిలో ప్రమాదాల బారిన పడి ఇప్పటికే పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. అయిన రీల్స్ పిచ్చిని యువత వదిలించుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఓ యువతి విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి వైర్ల(Electric Wires)ను పట్టుకుని ప్రాణంతకంగా రీల్స్ చేసింది.

ఆ సమయంలో స్తంభానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. యువతి చర్య రీల్స్ పిచ్చి పరాకాష్టను చాటింది. ఇలాంటి ఘటనలు మరెవరైనా స్ఫూర్తిగా తీసుకుంటే ప్రమాదకరమని..ఈ తరహా దుస్సాహసాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Tags:    

Similar News