MS Dhoni: శాంతాక్లాజ్ వేషధారణలో ఎంఎస్ ధోని.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్‌మస్ (Christmas) వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

Update: 2024-12-25 11:24 GMT
MS Dhoni: శాంతాక్లాజ్ వేషధారణలో ఎంఎస్ ధోని.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా క్రిస్‌మస్ (Christmas) వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ సంబురాల్లో దేశంలోని పలువురు రాజకీయ నాయకులు (Politicians), సినీ ప్రముఖులు (Movie Celebrities) క్రిస్‌మస్‌ పార్టీల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) శాంతాక్లాజ్ (Santa Claus) వేషధారణలో కనిపించి అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. భార్య సాక్షి (Sakshi), కూతురు జివా (Jiva)తో కలిసి పండుగ పూట ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలను ధోని భార్య సాక్షి సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫొటోలు కాస్త విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

Tags:    

Similar News