పన్ను చెల్లింపుదారులకు రూ. 71,229 కోట్ల రీఫండ్ చెల్లింపులు!
దిశ, వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుదారుల్లో కొవిడ్-19 ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో ఆదాయపు పన్ను శాఖ గత 3 నెలల్లో 21.24 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 71,229 కోట్ల రీఫండ్ చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. ఇందులో 19.79 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసిన రూ. 24,603 కోట్లు వ్యక్తిగత ఆదాయపు పన్ను, 1.45 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ. 46,626 కోట్ల విలువైన కార్పొరేట్ రీఫండ్‌లు చేసినట్టు సీబీడీటీ […]
దిశ, వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుదారుల్లో కొవిడ్-19 ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో ఆదాయపు పన్ను శాఖ గత 3 నెలల్లో 21.24 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 71,229 కోట్ల రీఫండ్ చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. ఇందులో 19.79 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు జారీ చేసిన రూ. 24,603 కోట్లు వ్యక్తిగత ఆదాయపు పన్ను, 1.45 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ. 46,626 కోట్ల విలువైన కార్పొరేట్ రీఫండ్‌లు చేసినట్టు సీబీడీటీ పేర్కొంది. ‘పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను వాపసులను తొందరగా జారీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి ఈ చెల్లింపులు జరిపినట్టు సీబీడీటీ వెల్లడించింది. ఇక ఈ చెల్లింపులు మొత్తం డిజిటల్ పద్ధతిలోనే జరిగాయని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారుల ఖాతాలోకి నేరుగా డబ్బులను బదిలీ చేయడం జరిగిందని సీబీడీటీ ప్రకటనలో పేర్కొంది. ‘కొవిడ్-19 వ్యాపిస్తున్న క్లిష్ట సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పన్ను సంబంధిత సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందనీ సీబీడీటీ తెలిపింది.