చైల్డ్‌వుడ్ ఫ్రెండ్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పిన హీరోయిన్

దిశ, సినిమా : ‘దఢక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడంతో తన ప్రతీ మూమెంట్‌ను క్యాప్చర్ చేస్తుంటుంది మీడియా. అలాగే ఫ్యాన్స్‌కు కూడా జాన్వీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జాన్వీ.. కొంతకాలంగా తన ఫ్రెండ్ అక్షత్ రాజన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో వాళ్లిద్దరూ జంటగా మీడియాకు చిక్కడంతో ఈ రూమర్స్‌కు బలపడగా.. […]

Update: 2021-09-15 02:19 GMT

దిశ, సినిమా : ‘దఢక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడంతో తన ప్రతీ మూమెంట్‌ను క్యాప్చర్ చేస్తుంటుంది మీడియా. అలాగే ఫ్యాన్స్‌కు కూడా జాన్వీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జాన్వీ.. కొంతకాలంగా తన ఫ్రెండ్ అక్షత్ రాజన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో వాళ్లిద్దరూ జంటగా మీడియాకు చిక్కడంతో ఈ రూమర్స్‌కు బలపడగా.. తాజాగా అక్షత్‌కు స్వీట్ బర్త్‌డే విషెస్ తెలుపుతూ జాన్వీ చేసిన పోస్ట్ వార్తల్లో నిలిచింది. అక్షత్‌ను ప్రపంచంలో ‘బెస్ట్ హ్యూమన్’గా వర్ణిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జాన్వీ.. ‘ఐ లవ్ యూ అక్షత్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రేమను వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో తను అక్షత్ భుజంపై వాలిపోయి కెమెరాకు పోజిచ్చిన ఫొటోను పోస్ట్ చేయడంతో వారి రిలేషన్‌షిప్‌పై మరోసారి రూమర్లు మొదలయ్యాయి.

అయితే గతంలోనూ వీరిద్దరిపై ఇదే తరహా న్యూస్ స్ర్పెడ్ కాగా.. చైల్డ్‌వుడ్ నుంచి అక్షత్ తన బెస్ట్ ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు మీడియా కారణంగా తను బయటికి వచ్చేందుకు భయపడుతున్నాడని వెల్లడించింది. ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రంలో నటిస్తున్న జాన్వీ.. ధర్మ ప్రొడక్షన్స్‌లో ‘దోస్తానా2’లోనూ కనిపించనుంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..