ఇండియా కోసం తరలివస్తున్న తారాలోకం

I FOR INDIA.. ఫేస్ బుక్ మెగా లైవ్ కన్సర్ట్. కరోనా విపత్కర పరిస్థితుల్లో భారతీయ, అంతర్జాతీయ ప్రముఖులు కలిసి పేదల ఆకలి తీర్చేందుకు చేస్తున్న ప్రయత్నం. కరోనా మహమ్మారి కారణంగా నిరుపేదలు పడుతున్న బాధలను ఎదుర్కొనే యత్నం. ఫేస్ బుక్ లో ఆదివారం రాత్రి. 7.:30 గంటలకు లైవ్ టెలి కాస్ట్ కానున్న కార్యక్రమం ఉద్దేశ్యం. 1. ప్రభుత్వ సూచనల మేరకు లాక్ డౌన్ కారణంగా ఇంటికి పరిమితం అయిన ప్రజలను అలరించడం. 2. ప్రోగ్రాం […]

Update: 2020-05-02 09:06 GMT

I FOR INDIA.. ఫేస్ బుక్ మెగా లైవ్ కన్సర్ట్. కరోనా విపత్కర పరిస్థితుల్లో భారతీయ, అంతర్జాతీయ ప్రముఖులు కలిసి పేదల ఆకలి తీర్చేందుకు చేస్తున్న ప్రయత్నం. కరోనా మహమ్మారి కారణంగా నిరుపేదలు పడుతున్న బాధలను ఎదుర్కొనే యత్నం. ఫేస్ బుక్ లో ఆదివారం రాత్రి. 7.:30 గంటలకు లైవ్ టెలి కాస్ట్ కానున్న కార్యక్రమం ఉద్దేశ్యం.

1. ప్రభుత్వ సూచనల మేరకు లాక్ డౌన్ కారణంగా ఇంటికి పరిమితం అయిన ప్రజలను అలరించడం.

2. ప్రోగ్రాం ద్వారా విరాళాలు సేకరించి తిండి లేక బాధపడుతున్న వారిని ఆదుకోవడం

3. వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మనకోసం పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలపడం.

కరణ్ జోహార్, జోయా అక్తర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న I FOR INDIA కన్సర్ట్ లో బాలీవుడ్ ప్రముఖులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, అలియా భట్, క్రికెటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ విల్ స్మిత్, బ్రయాన్ తదితరులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు.

ఏ ఆర్ రెహమాన్, గుల్జార్, శంకర్ – ఏహ్ సాన్ – లాయ్ , శ్రీయా ఘోషల్ లాంటి సంగీత ప్రముఖుల అద్భుత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

Tags : I FOR INDIA, Bollywood, Karan Johar, Shahrukh Khan, Aamir Khan, Priyanka Chopra, Virat Kohli

Tags:    

Similar News