కేసీఆర్ త్వరాత ‘సీఎం’ పదవిపై ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఈటలపై వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను సీఎం కావాలనుకోలేదని చెప్పారు. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే కావాలని ఆయన కోరినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు కూడా ఇవ్వకుండా విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే ఇంత […]

Update: 2021-05-04 04:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఈటలపై వచ్చిన ఆరోపణలు, ప్రభుత్వ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను సీఎం కావాలనుకోలేదని చెప్పారు. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే కావాలని ఆయన కోరినట్టు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు కూడా ఇవ్వకుండా విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశ చరిత్రలోనే ఇంత కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించలేదని విమర్శించారు. వ్యక్తులు ఉంటారు.. పోతారు.. కానీ, ధర్మం ఎక్కడికీ పోదని అన్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తానని తెలిపారు. తన వ్యవహారంలో మంత్రులు అత్యంత దారుణంగా మట్లాడుతున్నారని.. మంత్రుల వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. ఇతర పార్టీల వాళ్లతో మాట్లాడటమే నేను చేసిన తప్పా.. అని ప్రశ్నించారు. ఇకపై అన్ని పార్టీల నాయకులను కలుస్తాను, వారితో మాట్లాడతానని అన్నారు.

Full View

 

Tags:    

Similar News