పండుగ సీజన్‌పైనే ఆశలు
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే పండుగ సీజన్‌లో అమ్మకాలు పెరుగుతాయనే ఆశలతో ఉన్నట్టు ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ప్రస్తుతానికి కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. లేదంటే ఆటోమొబైల్ పరిశ్రమ బలమైన అమ్మకాలతో కొంత ఉపశమనం ఉండేదని హ్యూండాయ్ మోటార్ ఇండియా అధికారి తెలిపారు. దేశీయంగా రెండో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారు అయిన హ్యూండాయ్ మోటర్ ఇండియా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపులు మొదలైన తర్వాత కంపెనీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని, మే నెల […]
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే పండుగ సీజన్‌లో అమ్మకాలు పెరుగుతాయనే ఆశలతో ఉన్నట్టు ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ప్రస్తుతానికి కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. లేదంటే ఆటోమొబైల్ పరిశ్రమ బలమైన అమ్మకాలతో కొంత ఉపశమనం ఉండేదని హ్యూండాయ్ మోటార్ ఇండియా అధికారి తెలిపారు. దేశీయంగా రెండో అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారు అయిన హ్యూండాయ్ మోటర్ ఇండియా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ సడలింపులు మొదలైన తర్వాత కంపెనీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని, మే నెల నుంచి అమ్మకాలు పెరుగుతున్నాయని కంపెనీ పేర్కొంది.
ఏప్రిల్‌లో సున్నా యూనిట్ల అమ్మకాలు నమోదవగా, మేలో 6,883 యూనిట్లు, జూన్‌లో 21,320 యూనిట్లు, జులైలో 38,200 యూనిట్లతో ప్రతి నెల అమ్మకాల వృద్ధి నమోదు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పరిమిత లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నందున పండుగ సీజన్‌కు సంబంధించి కంపెనీ ఆశగా ఎదురుచూస్తోంది. కానీ, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే సానుకూలంగా కనిపిస్తున్నాయి. పండుగ సీజన్ కారణంగా డీలర్‌షిప్‌ల వద్ద స్టాక్‌ను పెంచుకోవాలని భావిస్తున్నట్టు హ్యూండాయ్ మోటార్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ చెప్పారు.