HYD-విజయవాడ జాతీయ రహదారి క్లియర్..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఇనాంగూడ వద్ద చెరువు ఉధృతిగా ప్రవహించింది. దీంతో రహదారి పూర్తిగా ధ్వంసమైంది. అందువలన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహించారు. దాంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పున: ప్రారంభమయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలోని ఇనాంగూడ వద్ద చెరువు ఉధృతిగా ప్రవహించింది.
దీంతో రహదారి పూర్తిగా ధ్వంసమైంది. అందువలన వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా వర్షం తగ్గుముఖం పట్టడంతో అధికారులు రోడ్డుకు మరమ్మత్తులు నిర్వహించారు. దాంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పున: ప్రారంభమయ్యాయి.