హైదరాబాద్‌లో పీహెచ్ఐసీ ఎగ్జిబిషన్
దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రివెంటివ్ హెల్త్‌కేర్ అండ్ ఇంఫెక్షన్ కంట్రోల్ ఎక్‌పో-పీహెచ్ఐసీ-2020’ మూడు రోజుల హైబ్రిడ్ ఎగ్జిబిషన్ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. నవంబర్ 19 నుంచి 21 వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా(ఏఫ్‌సీఏఐ), హైదరాబాద్, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్(ఐఎఫ్‌సీఏఐ), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్(టీఎఫ్ఎంసీ)లు మద్దతు ఇస్తున్నాయి. కరోనా మహమ్మారి లాంటి క్లిష్ట సమయాల్లో ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు అభివృద్ధి చేసే ఉత్పత్తులను, పరిష్కారాలకు సంబంధించి ప్రదర్శన […]
దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రివెంటివ్ హెల్త్‌కేర్ అండ్ ఇంఫెక్షన్ కంట్రోల్ ఎక్‌పో-పీహెచ్ఐసీ-2020’ మూడు రోజుల హైబ్రిడ్ ఎగ్జిబిషన్ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. నవంబర్ 19 నుంచి 21 వరకు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా(ఏఫ్‌సీఏఐ), హైదరాబాద్, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్(ఐఎఫ్‌సీఏఐ), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్(టీఎఫ్ఎంసీ)లు మద్దతు ఇస్తున్నాయి.
కరోనా మహమ్మారి లాంటి క్లిష్ట సమయాల్లో ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు అభివృద్ధి చేసే ఉత్పత్తులను, పరిష్కారాలకు సంబంధించి ప్రదర్శన తొలిసారిగా జరుతోందని టీఎఫ్ఎంసీ అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన, సాంకేతిక ఉత్పత్తులు, ఇన్ఫెక్షన్ నియంత్రణకు ఉత్తమ పద్ధతులను అందించేందుకు ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. కొవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ ఎక్స్‌పోలో 100 మంది ఎగ్జిబిటర్లు, 400 మంది ప్రతినిధులు, కొనుగోలుదారులు, 4000 మంది సందర్శకులు, 30 మంది ప్రత్యేక వక్తలు పాల్గొంటారని కార్యక్రమ నిర్వహాకులు తెలిపారు.