తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక ప్రాజెక్ట్‌పై కేంద్రం ఫోకస్

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కీలక ప్రాజెక్టు విషయంలో కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే హైదరాబాద్ నుంచి మూడు గంటల్లోనే ముంబైకి చేరుకుంటారు. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్వే కూడా చేపట్టినట్టు సమాచారం. భూసేకరణపై ఫోకస్ పెట్టిన […]

Update: 2021-09-27 21:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. కీలక ప్రాజెక్టు విషయంలో కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే హైదరాబాద్ నుంచి మూడు గంటల్లోనే ముంబైకి చేరుకుంటారు. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సర్వే కూడా చేపట్టినట్టు సమాచారం.

భూసేకరణపై ఫోకస్ పెట్టిన కేంద్రం బుల్లెట్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే మహారాష్ట్రలోని థానే జిల్లా అధికారులకు తెలియజేసింది. అయితే హైదరాబాద్-ముంబై మధ్య ప్రతిపాదిత రైలు మార్గంలో 650 కిలోమీటర్ల దూరంలో మొత్తం 11 స్టేషన్లు ఉండనున్నట్టు తెలుస్తోంది. బుల్లెట్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని జాతీయ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ) డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.కె. పాటిల్ థానే జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ సూర్యవంశీ, ఇతర అధికారులకు వీడియో రూపంలో వివరించారు.

అయితే ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 14 గంటలు పడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మూడు గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. దీంతో అతి తక్కువ సమయంలో ముంబైకి చేరుకోవచ్చు.

Tags:    

Similar News